Thursday, 5 November 2026

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పిడి యాక్ట్ నమోదు – కొత్తగూడెం డిఎస్పి రెహమాన్

జూలూరుపాడు, మే 19, జనంసాక్షి: మార్కెట్లో నకిలీ విత్తనాలను విక్రయించే వారి పట్ల నిరంతరం నిఘా ఉంటుందని, నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యల్లో భాగంగా పిడి యాక్ట్ నమోదు చేస్తామని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ తెలిపారు. మండల పరిధిలోని పడమటి నర్సాపురం రైతు వేదిక నందు కొత్తగూడెం డివిజన్ సహయ వ్యవసాయ సంచాలకులు కరుణ శ్రీ ఆధ్వర్యంలో కొత్తగూడెం డివిజన్ పరిధిలోని కొత్తగూడెం, చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్, జూలూరుపాడు మండలాలకు చెందిన విత్తన డీలర్లకు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విత్తన చట్టం, విత్తన చట్టం ప్రకారం ఏ విధంగా వ్యాపారం చేయాలి, బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్స్, సీడ్ స్టాక్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయడం గురించి డీలర్లకు వివరించారు. పిడి యాక్ట్ గురించి కూడా అధికారులు వివరించారు. నకిలీ విత్తనాలు అమ్మకం విషయం తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఆరు మండలాల మండల వ్యవసాయ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎస్ఐ గణేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.