శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంనకు జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ (ఎస్పీ) భాస్కర్ కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని, అలాగే అనుబంధ దేవాలయములలో గల స్వామివార్లను దర్శించుకున్నారు.వీరికి దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన, తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చిసన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచారి, రెనవేషన్ కమిటి సభ్యులు చుక్క రవి, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, స్థానిక SI కిరణ్ కుమార్ పాల్గొన్నారు.




