స్వరూపరాణి బెల్లంపల్లి, మే 2, (జనంసాక్షి )తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సోమవార రాత్రి ప్రకటించిన సిఓఈ సెట్-2023 రెండవ రౌండ్ ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల బెల్లంపల్లి విద్యార్థులు తమకు తిరుగులేదనిపించుకున్నారు. 16 మందికి సీట్లు వచ్చినట్లు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం నిర్వహించిన సిఓఈ సెట్ మొదటి దశ ఫలితాలు ఇప్పటికే విడుదలవగా 9మంది సీట్లు సాధించి జాయిన్ అయ్యారు. సోమవారం విడుదల చేసినరెండవ దశ ఫలితాలు అద్భుతంగా ఉండటంపట్ల ఆయన ఆనందం వ్యక్తంచేశారు. గురుకులంలో ఈ సంవత్సరం 10వ తరగతి పూర్తిచేసుకున్న 71 మంది విద్యార్థులు ఈ సెట్ కు హాజరు కాగా రెండు దశల్లో కలిపి అందులో మొత్తం 25 మంది సీట్లు సాధించారు. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ లో ముగ్గురు విద్యార్థులు సీట్లు సాధించి జాయిన్ అయ్యారు.ఇప్పటి వరకు మొత్తంగా 28 మంది సీట్లు సాధించినట్లు ప్రిన్సిపల్ ఐనాల సైదులు తెలిపారు.సెంకెండ్ లిస్ట్ లో సీట్లు సాధించిన విద్యార్థుల వివరాలు
వేల్పుల రఘువరన్ (బైపిసి,బిక్నూర్),దుగుట రాజేందర్ (బైపిసి,బిక్నూర్),తలారి రాజు(బైపిసి,బిక్నూర్),రత్నం అంజి (యంపిసి,బిక్నూర్),పెరుగు విష్హ్ణు వర్ధన్ (యంపిసి,బిక్నూర్),నీలాల అభిరాం (యంపిసి హత్నూర),బీరెల్లి అంజిబాబు (యంపిసి హత్నూర),దుర్గం సంజయ్ కుమార్ (యంపిసి హత్నూర),గోమాస యశ్వంత్ (యంపిసి హత్నూర),గోమాస నిఖిల్(యంపిసి ఇటిక్యాల),గోమాస వీర్ (యంపిసి బెల్లంపల్లి),దుర్గం సాయిక్రిష్ణ (యంపిసి మానకొండూర్),దుర్గం సూర్యకాంత్ (యంపిసి కొండాపూర్),బొల్లం ప్రజ్యోత్ కుమార్ (బైపిసి,వనపర్తి),కుమ్మరి సుహాస్ ప్రతీక్ (యంపిసి బెల్లంపల్లి),సుందిళ్ళ ఆదర్శ్ (యంపిసి బెల్లంపల్లి). ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రణాళికతో నిరంతరం విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న సిబ్బంది సమిష్టి కృషి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను నమోదు చేస్తామన్నారు.అభినందించిన ఆర్సీఓ
ఉత్తమ ఫలితాలే ధ్యేయంగా పనిచేస్తున్న బెల్లంపల్లి సిఓఈ ప్రిన్సిపాల్ ఐనాల సైదులు మరియు బోధన సిబ్బందికి ఆదిలాబాద్ రీజియన్ సాంఘిక సంక్షేమ గురుకులాల ప్రాంతీయ సమన్వయాధికారి (ఆర్సీఓ) కొప్పుల స్వరూప అభినందనలు తెలిపారు. 28మంది విద్యార్థులు సైనిక్ మరియు పలు సిఓఈ ల్లో సీట్లు సాధించిన సందర్భంగా ఫోన్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సిఓఈ బెల్లంపల్లి బాలుర విజయాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయని ఈ సందర్భంగా ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ కు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్, పొన్నం శ్రీనివాస్, ఐ మల్లేష్, రాజశేఖర్, రాజేశం, సమందర్, తేజస్వి తదితరులు పాల్గొన్నారు.




