కుట్టి వెల్లోడి ఆసుపత్రిని సందర్శించిన కార్పొరేటర్ సామల హేమ
సీతాఫలమండి లోని కుట్టి వెల్లోడి ఆసుపత్రిని సందర్శించిన కార్పొరేటర్ సామల హేమ. కుట్టి వెల్లోడి ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి వైద్య సేవలందుతున్నాయి వైద్య సిబ్బంది ఎలా పని చేస్తున్నారు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులు, చేసే పరీక్షలపై పూర్తి విషయాలు ఆమె తెలుసుకున్నారు. వాతావరణం మారడంతో ప్రజలు సీజన్ వ్యాధులు విషజ్వరాల బారినపడకుండా ఉండేందుకు తగిన చర్యలు ప్రజల కు అవగాహన కల్పించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం కార్పొరేటర్ సామల హేమ వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన గర్భిణీ స్త్రీతో మాట్లాడరు వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమలత తెరాస నాయకులు జాకీర్ తదితరులు పాల్గొన్నారు.