కురవి ఏప్రిల్ /26/జనం సాక్షి న్యూస్ : కురవి మండల కేంద్రంలో ఎఫ్ఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో,అయ్యగారిపల్లి లో ఐకేపీ ఆధ్వర్యంలో, కందికొండ,సూదనపల్లి లలో కాంపల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో మరియు సీరోల్ మండలంలో చింతపల్లి,రేకులతండా (s),ఉప్పరిగూడెం,కాంపల్లి గ్రామాల్లో పిఎసిఎస్ కాంపల్లి వారి ఆధ్వర్యంలో, సీరోల్,తాళ్ల సంకీస గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో మొత్తం 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు దళారుల మాయమాటలు విని ఆగం కావద్దని కోరారు.ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే కేంద్రాల్లో పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ నియోజకవర్గములో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతులకు తోడుగా ఉన్నారని అన్నారు. డోర్నకల్ నియోజకవర్గములో ఎన్నడూ లేని వరి సాగు అవుతుందంటే అది కేవలం రెడ్యానాయక్ ద్వారానే సాధ్యమైనదని అన్నారు. భవిష్యత్ లో రైతులందరు కేసీఆర్ కి,ఎమ్మెల్యే రెడ్యానాయక్ కి రుణపడి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జురి పిచ్చిరెడ్డి, బిఆర్ఎస్ కురవి మండల అధ్యక్షుడు తోట లాలయ్య,కురవి సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి,కాంపల్లి సొసైటీ చైర్మన్ కొండపల్లి శ్రీదేవి, గుండ్రాతి మడుగు సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకట్ రెడ్డి, రైతు సమితి కురవి మండల కన్వీనర్ ముండ్ల రమేష్,యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్, వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, సీరోల్ తహశీల్దార్ విజయ్ కుమార్,కురవి ఎంపీడీఓ సరస్వతి, మార్కెట్ డైరెక్టర్ లు గార్లపాటి భరద్వాజ్ రెడ్డి,సరియా,మక్కల వెంకన్న, ఏపీఎం కిరణ్,ఆయా గ్రామాల సర్పంచ్ లు నూతక్కి పద్మా నరసింహా రావు,బజ్జురి జ్యోష్ణ వెంకట్ రెడ్డి,వడ్డురీ పద్మా,దుస్సా ఫూలమ్మ, శ్యామల రంగమ్మ,తోట శోభారాణి రమేష్,రంజిత్ రెడ్డి,ఇనుగుర్తి సుగుణ,ఎంపీటీసీలు భోజ్య నాయక్,చిన్నం భాస్కర్, దేవేందర్, మండల సమైక్య అధ్యక్షులు,కార్యదర్శులు, సీసీ లు,మండల నాయకులు బండి యతీరాజు, కాంపల్లి సొసైటీ స్పెషల్ ఆఫీసర్ అజయ్,సోషల్ మీడియా మండల కన్వీనర్ మాలోత్ సూర్య నాయక్,యూత్ మండల నాయకులు బాణోత్ గణేష్,ఉప సర్పంచ్ లు,వార్డుమెంబర్ లు,రైతు సమితి గ్రామ కన్వీనర్ లు,సొసైటీ డైరెక్టర్ లు,నాయకులు,కార్యకర్తలు, రైతులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.




