టేకులపల్లి,ఏప్రిల్ 27( జనం సాక్షి): భారత రాష్ట్ర సమితి 23 వ ఆవిర్భావ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరంలోని తెలంగాణ భవన్ లోకి హాజరైన వ్యవస్థాప సభ్యులు తెలంగాణ ఉద్యమ నాయకులు , ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ప్రత్యేక ఆహ్వానంతో వెళ్లారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఎంతో ప్రీతి పాత్రుడైన దిండిగాల రాజేందర్ ఆవిర్భావ ప్రతినిధుల సమావేశానికి ఇల్లందు నియోజకవర్గం నుండి ప్రత్యేక ఆహ్వానంతో హాజరు కావడం పట్ల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వెలబుచ్చుతున్నారు.




