Thursday, 5 November 2026

కులం పేరుతో దూషించి కొట్టిన కేసు. విచారణలో

కులం పేరుతో దూషించి కొట్టిన కేసు. విచారణలో భాగంగా సావెల్ గ్రామానికి వచ్చిన ఏసిపి ప్రభాకర్ రావ్ మెండోరా నవంబర్ 22 (జనంసాక్షి)నిజమాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామంలో గత పాత గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులందరు కలిసి కమిటీ హాల్ రూంలో సమావేశం అయ్యారు. క్యాషియర్ జంబుగా సాయన్న అనే వ్యక్తి. గ్రామ లెక్కల విషయంలో పాత కమిటీ వైస్ చైర్మన్ అయిన “సాధ అనిల్”ను కులం పేరుతో దూషించి కొట్టాడని “సాద అనిల్” స్థానిక మెండోరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో బాగంగా సావెల్ గ్రామానికి ఏసిపి ప్రభాకర్ రావ్ వచ్చి గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలతో కలిసి విచారించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీనివాస్, ఎంపీటీసీ రాజు తదితరులు పాల్గొన్నారు