విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుంటూ , సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించుకోవడానికి చెకుముకి సైన్స్ పరీక్షలు దోహదపడతాయని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ బి.శ్రీనివాసరాజు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సూర్యాపేట మండల స్థాయి జనవిజ్ఞాన వేదిక చెకుముకి టాలెంట్ పరీక్షను నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ విజయ మోహన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత చిన్నారులు విజ్ఞాన శాస్త్ర అంశాలపై పట్టు సాధించడం ద్వారా సైన్స్ ఫలాలను సామాన్యులకు చేరేలా ఎదగాలని ఆకాంక్షించారు.జెవివి రాష్ట్ర కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ సూర్యాపేట విద్యార్థులు జిల్లా స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.మండలంలోని అన్ని పాఠశాలల నుండి 150 మంది విద్యార్థులు 50 జట్లుగా ఈ పరీక్షలో పాల్గొన్నట్లు జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు తెలిపారు.మండల స్థాయిలో ప్రథమ స్థానం పొందిన జట్లు 27న జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కార్యదర్శి మారం నారాయణరెడ్డి తెలిపారు.అనంతరం డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా వివిధ కేటగిరీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, డిక్షనరీలు, మెమెంటోలను అందజేశారు.ఈ పోటీలను చెకుముకి జిల్లా కన్వీనర్ ఇటుకల సైదులు,అనిత నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పద్మ , శంకర్ నాయక్, అరుణ,శ్రీనివాస్ గౌడ్, అంకతి వెంకన్న, ఆడం, వెంకట్ రెడ్డి విశ్వఘ్నాచారి తదితరులు పాల్గొన్నారు.




