.
నిజామాబాద్ బ్యూరో,ఏప్రిల్ 08(జనంసాక్షి):కుల బహిష్కరణ అనే విషయంలో ఎటువంటి వాస్తవం లేదని,కేవలం గుడికి సంబంధించిన విషయంలో విభేదాలు వచ్చాయని రామన్నపేట గ్రామ సంరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు.శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సభ్యులు రాజరాపు లింబాద్రి, శోభన్ , పర్స రత్నయ్యలు మాట్లాడుతూ రామన్నపేట్ గ్రామంలో ముదిరాజ్ లను గ్రామాభివృద్ధి కమిటీ కుల బహిష్కరణ చేసిండ్రు అని,ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని అబద్దాలు మాట్లాడడం జరిగిందని . అసలు విషయం పక్కన బెట్టి తప్పుడు ప్రకటనలు చేయడం బాధకరం అన్నారు. అసలు విషయం గ్రామంలో ముదిరాజ్ కులస్థులు పెద్దమ్మ ఆలయం ఉన్న సుమారు 5 ఎకరాల 30 గుంటల ప్రభుత్వ గైరాన్ భూమి కీ అనుమతి లేకుండా అక్రమంగా, దౌర్జన్యంగాప్రహరీ గోడ నిర్మించారు. ఆ స్థలం లో ఇంకా శుక్రరం దేవి, లక్ష్మి నృసింహా స్వామి, పాస్కారాజులు, ఎల్లుల్లా ఎల్లమ్మ, కొoడాపూరం ఎల్లమ్మ,పెడంగటి ఎల్లమ్మ ఆలయాలు నిర్మించి ఉన్నాయన్నారు. వాటికి వెళ్ళడానికి దారి వదలకుండా వారికి అనుగుణంగా ప్రహరీ నిర్మించుకొని గెట్ పెట్టి తాళం వేశారని. ఈ మిగితా ఆలయాలకు వెళ్లాడని దారి ఇవ్వండి అని అడిగితే దారి లేదు ఏమి లేదు మా గెట్ లొంచే పోండి రండీ అని గెట్ తాళం తీసేది లేదు అని అన్నారన్నారు. ఈ సమస్యను పక్కన బెట్టి తొలగించిన వీడిసీని బదునాం చేసేందుకు కుల బహిష్కరణ చేసిండ్రు అని అబద్దాలు చెప్పడం శోచనీయం అన్నారు. ముదిరాజ్ లు చెప్పే అబద్దం మాటలను నమ్మి మా గ్రామ సమస్యల్లో ముదిరాజ్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు తలదూర్చి అసలు విషయం తెలుసుకోకుండా ఆజ్యం పోస్తూ మాకు మాకు కొట్లాటలు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గ్రామ సమస్య మేమే పరిష్కరించుకొంటామని ఇందులో ఎవ్వరు తలదూర్చాద్దని అన్నారు. మా సమస్య మేము పరిష్కరించుకోలేని సమయంలో సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉందని తెలిపారు. గ్రామం లో కుల బహిష్కరణ, ఇసుక అక్రమ రవాణా అవస్తవమని వారు తేల్చి చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో గ్రామ సంరక్షణ కమీటి సభ్యులు జవ్వాజి వేణు, అంబకాతన్న, సాకలి నారాయణ, సోమ్ సాయన్న, మంగలి దామోదర్, ఎలుక సురేష్ గౌడ్,రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.




