గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 8 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని గద్వాల, అలంపూర్ పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్ల ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పి ఆర్ సి కి సంబంధించిన పెండింగ్ డి ఏ అలవెన్స్ ఇంకా రానివారికి, అలా రాని వారెందరు ఉన్నారు ,కారణమేమిటి, పి ఆర్ సి ఏరియాస్ 2020లో రిటైర్డ్ అయిన వారికి కూడా ఇంకా రాలేదని, ఈ కుబేర్ కి పంపారా పంపకపోతే ఆ వివరాలు తెలుపగలరని, పెన్షనర్ల గ్రాడ్యుటి అరియర్స్ కూడా కొందరికి రాలేదని, ఈ ఎల్ ఏరియర్స్ రాలేదని, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లు డబ్బులు ఇంకా ఖాతాలో జమ కాలేదని, ఈ కుబేర్ కు పంపితే ఎందుకు రాలేదని, వాటి వివరాలు తోపాటు అలంపూరు, గద్వాల ఎస్టీఓ ల పరిధిలోని పెన్షనర్ల లిస్టు కూడా ఇవ్వాలని వారు జిల్లా ట్రెజరీ అధికారి కి లిఖితపూర్వకంగా వారిని అడిగినట్లు, అదేవిధంగా ఈనెల 10వ తేదీ నుండి అఖిల భారత పెన్షనర్ల ఫెడరేషన్ తెలంగాణ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో చేపడుతున్నామని అందులో భాగంగానే ఏప్రిల్ 10 జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం దిగ్బంధం జరగనున్నదని జోగులాంబ గద్వాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి అబ్దుల్ బాబు, రాష్ట్ర కార్యదర్శి ఇక్బాల్ బాషా, కార్యదర్శి ధరణి అనుమంతు, ప్రధాన కార్యదర్శి శంకర ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.




