మెట్పల్లి టౌన్, జనవరి 25,
జనంసాక్షి :
జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని రేగుంట (22వ వార్డు) లో నక్కల,పిట్టల వారికి సంబంధించిన ఇరవై కుల ధ్రువీకరణ మంజూరి పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నపిల్లలకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది అని తెలిపారు.గతంలో ఏ ప్రభుత్వం కూడా పిట్టల కులస్తులకు సర్టిఫికేట్ ఇవ్వలేదని,మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిని ఎస్టీలో చేర్చినారని తెలిపారు.అన్ని కులాల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని కొనియాడారు. కెసిఆర్ ఆలోచన పేద బతుకులు లాగా ఉండకుండా వారు కూడా ధనవంతుల్లా బతకాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నడిమెట్ల సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ రాణావేని సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర్ రావు, కౌన్సిలర్ బంగారు కాళ్ల కిషోర్,జియ, చర్లపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కుల ధ్రువీకరణ మంజూరి పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు




