Wednesday, 4 November 2026

గ్రామాల అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం.

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్. జనవరి25/23..

 

ఫోటో రైట్ అప్03 తుర్కపల్లి.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ,ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి లు అన్నారు.బుధవారం తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో 10 లక్షల వ్యయంతో సిడిపి ఎమ్మెల్సీ నిధులతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనమును ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.కరెంటు కష్టాలు లేని తెలంగాణ తెచ్చుకున్నట్లు, మత్స్యకారులు చేపలు అమ్మడానికి స్టాల్ మంజూరు చేస్తామని అన్నారు.కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను ఆపకుండా అన్ని పథకాలను అందించిన ఏకైక ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు .దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అన్నారు .గ్రామంలో సిసి రోడ్ల కొరకు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, జెడ్పి వైస్ చైర్మన్ బిక్కు నాయక్, వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, సర్పంచ్ యాట పోచమని పెంటయ్య ,పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, సర్పంచులు కల్లూరి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో మానే ఉమాదేవి, ఉప సర్పంచ్ సీతరాజు, సుంకరి శ ట్టయ్య తదితరులు పాల్గొన్నారు.