Wednesday, 4 November 2026

యాంత్రిక వస్తువులకు దూరంగా ఉందాం కుటుంబ సభ్యులతో సంబంధాలు పెంచుకుందాం

హుజూర్ నగర్ జనవరి 25 (జనంసాక్షి): నేటి సమాజంలో యాంత్రిక వస్తువులకు అలవాటు పడడం వలన మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయని హుజూనగర్ ఎస్సై కే. వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని గ్రీన్ వుడ్ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మానవ సంబంధాలు యాంత్రిక వస్తువుల కన్నా గొప్ప వైనవి అనే కార్యక్రమం పై పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు పట్టణంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి, గ్రీన్ వుడ్ స్కూల్ డైరెక్టర్ తుమ్మ సరితమర్రెడ్డి లు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు యాంత్రిక వస్తువులకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో సంబంధాలు పెంచుకోవాలని, తద్వారా విలువలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏవి కృష్ణారావు, ప్రిన్సిపల్ రాజారెడ్డి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.