కువైట్ జైల్లో భారతీయ ఖైదీ ఆత్మహత్య
కువైట్: నేర విచారణ ఎదుర్కొంటున్న ఓ భారతీయ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. జైల్లో అందరూ నిద్రిస్తున్న సమయం చూసి ఉరేసుకున్నాడు. తనకు ఇచ్చిన దుప్పటినే ఉరిపోసుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఈ ఘటనపై సంబంధిత మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. జైలు అధికారులు తీవ్రంగా హింసించడం వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు ఖైదీలు చెప్పుకుంటుండగా, డిప్రెషన్‌కు లోనవడం వల్లే అతడు ఉరి వేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.