గొప్ప విషయం – ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ జనవరి 22 (జనంసాక్షి) అంతరించిపోతున్న కుస్తీ పోటీలను గుర్తు చేసేందుకు జహీరాబాద్ ప్రాంతంలో కుస్తీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయం అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. జహీరాబాద్ పట్టణంలోని బాగా స్టేడియంలో అంతర్ రాష్ట్ర కుస్తీ పోటీలు స్థానిక మల్లయోధులు అలీ అహ్మద్ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలకు జహీరాబాద్ శాసనసభ్యులు కే మాణిక్ రావు ముఖ్య అతిథిగా హాజరై కుస్తీ పోటీలను ప్రారంభించారు. అనంతరం కుస్తిపోటిలో గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతులతో పాటు ట్రోపీలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు మొహమ్మద్ తన్విర్, కిజర్ యపై,బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మోహియోద్దీన్, షేక్‌ఫరీద్, బిజీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
కుస్తీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయం కుస్తీ పోటీలు నిర్వహించడం




