అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం
మూడోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన గండూరి కృపాకర్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):వస్త్ర వ్యాపారులంతా కలిసికట్టుగా ఉండి వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవాలని, పట్టణ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మూడోసారి గండూరి కృపాకర్ ఎన్నిక కావడం అభినందనీయమని ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి శంకర్ అన్నారు.ఆదివారం పట్టణ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన పట్టణ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. సంఘం, సభ్యుల కోసం పనిచేసే నాయకుడితోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.సంఘ సభ్యులంతా కలిసికట్టుగా ఉంటూ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.హ్యాట్రిక్ సృష్టించి మూడోసారి అధ్యక్షుడిగాఎన్నికైన గండూరి కృపాకర్ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా అధ్యక్షుడిగా ఉంటూ సంఘ సభ్యులతో కలసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.కరోనా కష్టకాలాన్ని సైతం వ్యాపారులు ధైర్యంగా ఎదుర్కొనేందుకు కృషి చేశానన్నారు.తమ సంఘం ఆధ్వర్యంలో కరోనా సమయంలో దాతల సహకారంతో అన్నార్తులకు ఉదయం,రాత్రి అన్నదానం చేయడం జరిగిందని గుర్తు చేశారు.ఈ రెండేళ్ల పదవీకాలంలో సంఘ అభివృద్ధికి మరింత కృషి చేస్తూ సంఘ బలోపేతానికి పాటుపడుతానన్నారు.అనంతరం పట్టణ అధ్యక్షులుగా మూడోసారి గండూరి కృపాకర్, ఉపాధ్యక్షులుగా గుంటి మధుసూదన్, శింగిరికొండ ప్రదీప్ కుమార్, సయ్యద్ షఫీ, ప్రధాన కార్యదర్శిగా ఎలగందుల సుదర్శన్, సహాయ కార్యదర్శిగా దూలం నగేష్, సంయుక్త కార్యదర్శిగా బొమ్మగాని సైదులు, తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా అనంతుల రాజేశ్వర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పాపని యాదగిరిలు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ , నూకల మధుసూదన్ రెడ్డి, బండారు రాజా, ముప్పారపు నాగేశ్వరరావు, నూకల వెంకటరెడ్డి, పిసిక వీరయ్య, సంఘ ప్రధాన సలహాదారులు కర్నాటి సురేందర్, మొరిశెట్టి కోటేశ్వర్ రావు,ఈగ వెంకటేశ్వర్లు,సింగరికొండ రవీందర్,సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పట్టణ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవంఘనంగా పట్టణ క్లాత్ మర్చంట్స్




