Wednesday, 4 November 2026

కుస్తీ పోటీల్లో సత్తా చాటిన వారికి బహుమతులు అందజేత

కుస్తీ పోటీల్లో సత్తా చాటిన వారికి బహుమతులు అందజేత

 

రాయికోడ్ జనం సాక్షి జనవరి 09 రాయికోడ్ మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో సోమవారం శ్రీ శ్రీ శ్రీ అజరత్ శంశర్ తబ్రెష్ హుర్స్ ఉత్సవాలు సందర్భంగా మల్ల యోధుల కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి మండలాల నుంచి కుస్తీ పోటీ దారులు పాల్గొన్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతి ఐదు తులాల వెండి తులాల కడియం, రెండవ బహుమతి4 5 కడియం అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ఏడుకొండలు స్థానిక సర్పంచ్ హనుమంతు జెడ్పీటీసీ మల్లికార్జున్ పటేల్, ఎంపీపీ మమత అశోక్. ,ఆత్మ కమిటీ చైర్మన్ చేవెళ్ల విఠల్ ,మండల బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్, ఉపాధ్యక్షులు మల్లేష్ యాదవ్, వర్మ వైస్ ప్రెసిడెంట్ తుకారాం, ఎమ్మార్వో ప్రభులు, ఆర్ ఐ .శ్రీకాంత్, ప్రభాకర్, ఎంపిటిసిలు నిరంజన్ ,పండరి,లక్ష్మీ విష్ణువర్ధన్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్ లు బీ ప్రవీణ్ కుమార్ , శంకర్ ,కృష్ణ నాగర్జున , సంతోష్ కుమార్, సొసైటీ డైరెక్టర్ విశ్వనాధ్ మాజీ సర్పంచ్ లింగమయ్య . సంగమేష్ ముదిరాజ్. అశోక్. తదితరులు పాల్గొన్నారు.