మన ఊరు మన బడి అభివృద్ధి పనులు పరిశీలించిన స్టేట్ డైరెక్టర్ విజయలక్ష్మి బాయ్
జనం సాక్షి,చెన్నారావుపేట
మండలం లోని మన ఊరు మనబడి అభివృద్ధి పనులు జరుగుతున్న అమృతండ పాఠశాలను రాష్ట్ర డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్, ఎఫ్ ఎల్ ఎన్ ఓ ,ఎం .ఓ.ఎం.బి.అబ్జర్వార్ అధికారిని ఎస్ విజయలక్ష్మి బాయ్ పరిశీలించారు.ఈ సందర్భంగా
ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తుందన్నారు. నిధులను పాఠశాల అభివృద్ధికి దోహదపదే విదంగా స్థానిక సర్పంచ్ ప్రజా ప్రతినిధులు సమిష్టి కృషితో పాఠశాలలో ఎన్ ఆర్ జి ఎస్ పనులను గ్రామ సర్పంచ్ ల సహకారంతో పనులను పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులు కు సూచించారు. గ్రామ సర్పంచ్ లు పాఠశాల అభివృద్ధి కొరకు ఈ ఎన్ ఆర్ జి ఎస్ పనులను త్వరిత గతిన పూర్తి చేసే విధంగా కృషి చేయాలని కోరారు.అధికారులు, ప్రజా ప్రతినిధులు తో మన ఊరు మన బడి అభివృద్ధి పనులు జరుగుతున్న తీరుపై ప్రధానోపాధ్యాయులు మీ పాఠశాల లో మన ఊరు మన బడి అభివృద్ధి పనులను పెండింగ్ లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ పాఠశాలల కు ప్రభుత్వం ఫర్నిచర్ సౌకర్యం లను కల్పించబోతుంది.కావున ప్రజాప్రతినిధులు కూడా పాఠశాల అభివృద్ధి కి ప్రధానోపాధ్యాయులు కు సహకరించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి వడపెళ్లి సుధీర్ బాబు,మండల విద్యా అధికారిని రత్నమాల ,ఉపాధ్యాయుడు బానోత్ వెంకన్న,సి ఆర్ పి బాలు, మెసెంజర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.




