Wednesday, 4 November 2026

ఘనంగా త్యాగరాజస్వామి వారి 176వ ఆరాధనోత్సవాలు

ఘనంగా త్యాగరాజస్వామి వారి 176వ ఆరాధనోత్సవాలు

హైదరాబాద్‌ జనవరి 9, (జనంసాక్షి) : శ్రీశ్రీ త్యాగరాజస్వామి వారి 176వ ఆరాధనోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ గాయత్రి సంగీత కళాశాల వనస్థలిపురం వారిచే శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల వ్యవస్థాపకులు చుండూరు శకుంతల, సుబ్బారావు సంతానం పెమ్మరాజు కళ్యాణి, రంగనాథ్‌,మన్నెపల్లి బలరామ్‌కుమార్‌, పడమన్నాటి అన్నపూర్ణ చంద్రశేఖర్‌, ముదిగొండ మహేశ్‌, కళాశాల విద్యార్థులు ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత డాక్టర్‌ చింతలపాటి శూలపాణి వేషధారణతో కళాశాల విద్యార్థులతో కలిసి కళాశాల నుండి దేవాలయం వరకు నగర సంకీర్తన గావించారు. తదుపరి పంచరత్నసేవ చేశారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ఆన్‌లైన్‌,ఆఫ్‌ లైన్ల ద్వారా త్యాగరాజ స్వామివారి కీర్తలను ఆలపించి కార్యక్రమాన్ని జయప్రదంగా, ఆనందంగా జరిపారు.