Monday, 2 November 2026

 కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో ట్విస్ట్‌

హైదరాబాద్‌: కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసులో ట్విస్ట్‌ నెలకొంది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రకారమే సతీష్‌ను హేమంత్‌ హత్యచేసినట్టు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో చిన్ననాటి స్నేహితుడిని అతి కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. హేమంత్ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు సంబంధాలు ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హేమంత్ , సతీష్ మధ్య ఆర్థిక పరమైన గొడవలు తలెత్తినట్టు పోలీసులకు ప్రియాంక స్టేట్మెంట్ ఇచ్చింది. సతీష్‌ను ఇంటికి రప్పించి హేమంత్ కిరాతకంగా హత్య చేశాడు. హత్య సమయంలో హేమంత్‌తో మరో మహిళ ఫ్లాట్ లో ఉన్నట్టు పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. నిందితుడు హేమంత్ కోసం రెండు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.