– టీఆర్‌ఎస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం
– గత పాలకుల హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడింది
– మళ్లీ అవకాశం ఇస్తే సూర్యాపేటలో రెట్టింపు అభివృద్ధి చేస్తా
– ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డి
– జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరికలు
సూర్యాపేట, నవంబర్6(జనంసాక్షి) : కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అపవిత్ర పొత్తులతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకొనేందుకు ప్రజల ముందుకు గెలిపించాలని వస్తున్నారని, వారి కుట్రలను గమనించి ప్రజలంతా ఏకమైన తిప్పికొట్టాలని ఆపద్ధర్మ మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలో టీఆర్‌ఎస్ లోకి పలువురు చేరారు. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ లో మాజీ జెడ్పీటీసీ పెద్ద గట్టు మాజీ చైర్మన్ మామిడి ప్రసాద్ యాదవ్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గవ్వ దయాకర్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన మరో 200 మంది గ్రామస్తులకు గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆపద్ధర్మ మంత్రి మాట్లాడారు.. గత పాలకుల హయాంలో గ్రావిూణ అభివృద్ధి కుంటుపడిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పిల్లలమర్రి గ్రామానికి రూ.12కోట్లు నిధులతో అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు ఎందుకు ఇన్ని నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలే కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు అని గుర్తు చేశారు. 2014 ఎన్నికల ముందు చెప్పకపోయినా.. చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 2014 తర్వాత సూర్యాపేట నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు. మళ్లీ అవకాశం ఇస్తే సూర్యాపేట నియోజక వర్గాన్ని రెట్టింపు అభివృద్ధి చేస్తానని మంత్రి జగదీష్ రెడ్డి హావిూ ఇచ్చారు. కరెంటు సాకుతో ఏకంగా ప్రభుత్వాన్ని కూల్చి అసలు తెలంగాణ రాష్ట్రం వద్దనే రీతిన ఉద్యమాలు చేయాలనే కుట్రతో పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కుయుక్తులు పన్నారని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయకముందే మొదటి అసెంబ్లీలో.. ప్రస్తుత కాంగ్రెస్‌లో ఉన్న నాటి టీడీపీ నాయకుడు అసెంబ్లీకి వచ్చి కరెంటు ఇవ్వని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడని గుర్తుచేశారు. అంతటితో ఆగకుండా ఆ పార్టీలో ఉన్న కొంతమంది బ్రోకర్లతో పల్లెల్లో విద్యుత్ సమస్య ఉందంటూ టీఆర్‌ఎస్ దిమ్మెలు పగులకొట్టారన్నారు. మరో పక్క విద్యుత్ సమస్యను మరింత పెంచేరీతిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడు మండలాల పేరిట సీలేరు పవర్ ప్రాజెక్టును కేంద్రం అండతో కుట్ర చేసి తీసుకొని తెలంగాణకు కరెంటు లేకుండా చేయాలని పన్నాగం పన్నారని గుర్తుచేశారు. ఇలాంటి చంద్రబాబు తెలంగాణలోని కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు వత్తాసు పలుకుతూ కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులు అడ్డుకొనే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానం తెరాస నేతలు పాల్గొన్నారు.
కూటమి కుట్రలను తిప్పికొట్టండి




