Thursday, 5 November 2026

కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ షాద్నగర్ లో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు

జనం సాక్షి  వీడ్కోల సమావేశాన్ని పాఠశాల ప్రాంగణం లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తమ పాఠశాల జీవితం ఏ రకంగా సాగిందో ఎంతో భావోద్వేగాలకు తాము నేర్చుకున్న అంశాలను మరియు వారి పట్ల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు చూపించిన కరుణ మరియు వారికి బోధించిన అంశాలను గుర్తుతెచ్చుకున్నారు 10వ తరగతి విద్యార్థులు మాట్లాడుతూ సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్యంతం ఆయ్యారు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రఫత్ సుల్తానా గారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని తమ విద్యార్థిని విద్యార్థులు అందరూ రాబోవు వార్షిక పరీక్షలలో అత్యుత్తమ జిపిఏ సాధించాలని పరీక్షా ఫలితాల ద్వారా తమ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరును తేవాలని వారు తమ జీవితంలో ఎంతో అత్యున్నత స్థాయిలకు ఎదగాలని ఎదిగినప్పటికీ తమ పునాదులను మర్చిపోకుండా ఉండాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు ఇందులో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు తొమ్మిదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు