గండికోడుతున్న ఘరానా ముఠాని అరెస్ట్ చేసినా టాస్క్ ఫోర్స్ పోలీసులు..నకిలీ వే బిల్ల్స్ ద్వార అక్రమంగా ఇసుక తరలిస్తూ, ప్రభుత్వ ఖజానాకు గండికోడుతున్న ఘరానా ముఠాని అరెస్ట్ చేసినా టాస్క్ ఫోర్స్ పోలీసులు..
ఏటూరునాగారం(జనం సాక్షి),మార్చి20. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందిరికి అందుబాటు ధరలో ఇసుక అందిచాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రములోని వివిధ జిల్లాలలో ఇసుక క్వారీలను గుర్తించడం కోసం 1. అడిషనల్ డైరెక్టర్ మైన్స్, 2. గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంటు, ౩. రెవిన్యూ అధికారులు, 4. ఇరిగేషన్ అధికారులు మరియు 5. టి యస్ యం డి సి అధికారుల ద్వార ఒక కమిటి ఏర్పాటు చేస్తారు. అ కమిటి వారు ఇసుక రీచ్ గుర్తించి అక్కడ ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఇసుక ఉంది, దాని కో-ఒర్దినటేస్ తో కూడిన రిపోర్ట్స్ ను సంబందిత జిల్లా కలెక్టర్ కు అందిస్తారు. జిల్లా కలెక్టర్ గారు టి యస్ యం డి సి రిపోర్ట్ పంపిచంగా వారు టెండర్స్ ఆహ్వానించి ఏదైనా ఏజెన్సీ కి ఇస్తారు. వారు మైనింగ్ ప్లాన్, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ బోర్డు నుండి క్లియరెన్స్ సర్టిఫికెట్స్ తీసుకొని టి యస్ యం డి సి కి రిపోర్ట్ అందిస్తారు. వాటి ఆదరంగా సంబదిత కలెక్టర్ గారు ఇసుక రీచ్ నుండి ఇసుక తీయడం కోసం ఆర్డర్స్ ఇస్తారు.
దానికనుగుణంగా సంబదిత రీచ్ కు సంబంధించి అక్కడ ఒక సొసైటీ తాయారు అయిన తరువాత టి యస్ యం డి సి కి మరియు సొసైటీ కి మద్య అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేసుకున్న తరువాత ఇసుక క్వారీ నుండి ఇసుకను ట్రాక్టర్స్ ద్వార స్టాక్ యార్డ్ వద్ద డంప్ చేస్తారు. సొసైటీ అట్టి ఇసుక లారిలలో తీసుకురావడం కోసం, లారి యజమానులు ఆన్లైన్ లో 12 టైర్లు గల లారిలో 26 టన్నులకు రు.10,238, 14 టైర్లు గల లారిలో 32 టన్నులకు రు.13,085, 16 టైర్లు గల లారిలో 35 టన్నులకు రు.14,800 లతో డి.డి కట్టి దానిని డ్రైవర్స్ కు ప్రింట్ తిసి ఇచ్చిగాని, లేదా వాట్సాప్ ద్వార పంపింస్తే డ్రైవర్స్ వాటిని మీసేవలో ప్రింట్ తీసుకొని ఇసుక క్వారీ వద్దకు వెళ్ళగా టి యస్ యం డి సి కి చెందిన ఒక వ్యక్తి వచ్చి, అట్టి డి.డిని తీసుకొని అట్టి లారీలను ఇసుక రీచ్ వద్దకు పంపగా అక్కడ టి యస్ యం డి సి కి చెందిన సెక్యూరిటీ గార్డ్ అందులో డి.డి ఉన్నంత ఇసుకను నింపి పంపిస్తారు. అప్పుడు వారు ఒక వేబిల్ ఇస్తారు. అట్టి వే బిల్ తో డ్రైవర్ ఇసుక తీసుకోని వస్తుండగా మర్గామద్యంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద అ బిల్ చూపిస్తే, వారు స్టాంప్ వేసి పంపిస్తారు మరియు అక్కడ ఫారెస్ట్ అధికార్లు ఎన్విరాన్మెంట్ ఫీ క్రింద 200/- నగదు రశీదు ఇస్తారు. అట్టి వే బిల్లు మరియు రశీదు తీసుకొని డ్రైవర్ ఇసుక లారి తీసుకొని ఓనర్ చెప్పిన వారికీ పంపిస్తాడు.
ఈ విధంగా చేస్తే డబ్బులు రావడం లేదు అని అక్రమంగా సులువైన పద్ధతిలో డబ్బును సంపాదించుకునే దురాలోచనతో నకిలీ వే బిల్ తయారు చేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 1. ఎదుల కిరణ్ కుమార్ తండ్రి పేరు పెద్ద ముత్యాలు, వయసు 37 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృతి: ఫోక్ యూట్యూబ్ ఛానల్, నివాసం పుట్టపాక గ్రామం, నారాయపూర్ మండలం, యదాద్రి భువనగిరి జిల్లా, 2. షేక్ ఇమ్రాన్ తండ్రి షబ్బీర్, వయసు: 28 సంవత్సరాలు, ముస్లిం, వృతి: బిజినెస్ (లారి ఓనర్), నివాసం: పేరూర్ గ్రామం, వాజేడు మండలం, ములుగు జిల్లా, ౩. గంట ప్రదీప్ రెడ్డి @ సందీప్ రెడ్డి, తండ్రి పేరు సంపత్ రెడ్డి, వయసు: 28 సంవత్సరాలు, కులం: రెడ్డి, వృతి: బిజినెస్ (లారి ఓనర్), నివాసం: భరత్ నగర్, ఉప్పల్, హైదరాబాద్ మరియు 4. మంచిల్ల వెంకటేశ్ తండ్రి లింగయ్య, వయసు: 22 సంవత్సరాలు, కులం: యాదవ్, వృత్తి: లారి డ్రైవర్, నివాసం: కొతపల్లి గ్రామం, భీమదేవరపల్లి మండలం లను టాస్క్ ఫోర్స్ మరియు మట్వాడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 16 లారీలు ,65 నకిలీ వే బిల్ టి యస్ యం డి సి స్టంప్స్ – 16, 1 లాప్ టాప్, 11 సెలఫోన్ లు మరియు 41000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టుకు సంబంధించి శ్రీ ఏ. వి రంగనాథ్, ఐపీఎస్, కమీషనర్ అఫ్ పోలీస్, వరంగల్ కమిషనరేట్ గారు వివరాలు వెల్లడిస్తూ, నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు మట్వాడ పోలీసులు నకిలీ వే బిల్లులు తయారు చేస్తున్న కిరణ్ కుమార్ నీ అదుపులోకి తీసుకొని విచారించగా అతను గత 3 సంవత్సరాల నుండి తయారు చేస్తూ వాటిని లారీ యజమానులకు ఇస్తున్నాడు. ఈ విధంగా ఇప్పటి వరకు దాదాపు 1700 వరకు తయారుచేసి ఇచ్చాడు. ఇదే క్రమంలో ఇతనికి పరిచయము అయినా సందీప్ రెడ్డి, రాజగోపాల్ గౌడ్, చరణ్ గౌడ్, రాకేష్ మరియు ఇమ్రాన్ లకు ఇచ్చేవాడు. వారు వాటిని వారికి స్వంతగా వాడుకుంటూ వేరే ఇతర లారీ యజమానులకు ఇచ్చేవారు అట్టి యజమానులు వాటిని ఉపయోగించి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని క్వారీల నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానకి రావలసిన అందాజ ౩౦ కోట్ల ఆదాయాన్ని కొల్లగొట్టి నారు. ఈ సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని మట్వాడ, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ మరియు ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు మరియు మరికొందరు పరారీ లో ఉన్నారు.ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్ ఏసిపి జితేందర్ రెడ్డి, ఇన్సెస్ఫెక్టర్లు శ్రీనివాస రావు, వెంకటేశ్వర్లు, మట్వాడ, కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, ధర్మసాగర్ ఎస్.ఐలు శంకర్, ఫిలిప్ రాజు, విజయ్, టాస్క్ఫోర్స్ ఎస్.ఐ లు లవణ్ కుమార్ , నిస్సార్ పాషా టాస్క్ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్ స్వర్ణలత, కానిస్టేబుల్లు సురేష్, శ్యాం, నవీన్, కరుణాకర్, ప్రభాకర్, రాజేందర్ రెడ్డి, బిక్షపతి, రాజేష్, రాజు, శ్రీను, శ్రవణ్ మరియు నాగరాజులను సీపీ గారు అభినందించారు.
నకిలీ వే బిల్ల్స్ ద్వార అక్రమంగా ఇసుక తరలిస్తూ, ప్రభుత్వ ఖజానాకు




