Wednesday, 4 November 2026

కృష్ణానదిలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య

పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం, పెదపులిపాక వద్ద కృష్ణానదిలో మునిగిపోయి, మృతిచెందిన విద్యార్థుల సంఖ్య ఆరుకు పెరిగింది. శుక్రవారం నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీయగా సీఆర్‌పిఎఫ్‌ జవాన్లు శనివారం మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. నీటి ఉరవడికి ఈ రెండు మృతదేహాలు దిగువకు కొట్టుకుపోయినట్టు భావిస్తున్నారు. నల్లూరి ఏసుపాదం, చేకూరి ఫణీంద్రల మృతదేహాలను సంఘటన స్థలానికి అర కిలోమీటరు దూరంలో చోడవరం వైపున్న నీటిమడుగు నుంచి బయటకు తీసి, శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *