ఇటిక్యాల (జనంసాక్షి) జూన్ 6 : మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి చెందిన ఇస్మాయిల్, ఇద్దరు కుమారులు, ఇబ్రహీం ఇద్దరు కూతురులు సోమవారం పల్లెపాడు గ్రామ శివారులోని కృష్ణానదిలో ఈతకు వెళ్లి దురదృష్టవశాత్తు అందులో మునిగి చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథ్, అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ మంద శ్రీనాథ్ లు మంగళవారం కర్నూలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో వారి నివాసానికి వెళ్లి చిన్నారుల మృతుదేహాలను చూసి చలించిపోయినారు. ఈ సందర్భంగా మృతదేహాలకు పూల మాలలు వేసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గిడ్డారెడ్డి, గిరిధర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ యువ నాయకులు ఏకాంత్, డాక్టర్ వహిద్, కిరణ్, శివ, బాబు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణానదిలో మునిగి చనిపోయిన బాధిత కుటుంబాలకు పరామర్శ




