ఎల్కతుర్తి జూన్ 6 జనం సాక్షిఎల్కతుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ కుడలి వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ కరపత్రం విడుదల చేసిన అనంతరం సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ ప్రజాగర్జన పేరుతో భద్రాద్రి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఈనెల 11న బహిరంగ సభ నిర్వహిస్తున్నందున ప్రజలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు సింగరేణి ప్రైవేటీకరణ కాంట్రాక్ట్ ఈకరణకు వ్యతిరేకంగా కొత్త మైన్స్ కొరకు పోరాటం చేయాలని రాష్ట్రంలో సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి సౌకర్యం కల్పించాలని రిటైర్డ్ కార్మికుల నివసిస్తున్న క్వార్టర్స్ ను వారికే కేటాయించాలని సింగరేణి కార్మిక ప్రాంతాల్లో 76 జీవో ద్వారా అందరికీ పట్టాలు ఇవ్వాలని రిటైర్డ్ సింగరేణి కార్మికులకు పెన్షన్ పెంచాలని కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలన్నారు బయ్యారం ఒక్క కర్మాగారం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన విశ్వవిద్యాలయం ఐఐఎం ఐఐటి ఉన్నత విద్య సంస్థలను ఏర్పాటు చేయాలని ఖమ్మంలో ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులో ఎల్ఐసి రైల్వే టెలికాం విమాన సంస్థలు నౌకాశ్రయాలు ఆయిల్ కంపెనీలు రక్షణ పరిశోధన రంగాలను ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలన్నారు బ్రిటిష్ వారి కాలంలో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని నాలుగు కోడ్లను రద్దు చేయాలని పాత చట్టాలను యాదవ్ విధంగా కొనసాగించాలని 8 హక్కును కొనసాగించాలన్నారు సీనియర్ సిటిజన్స్ కు రైల్వేచార్జీలలో పాత పద్ధతిలో రాయితీ ఇవ్వాలన్నారు కృష్ణ గోదావరి నదుల నిర్మాణంపై కృష్ణ గోదావరి నదుల మేనేజ్మెంట్ బోర్డును రద్దుచేసి సీతారామ ప్రాజెక్టు నెట్టెంపాడు కోయల్ సాగర్ జూరాల బీమా కల్వకుర్తి డిండి ఎస్ఎల్బీసీ నక్కలగండి శ్రీరాంసాగర్ వరద కాలువ ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఉపయోగపడే ప్రాణహిత ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టుల సింగరేణి ఓపెన్ కాస్ట్‌ల రోడ్లు రైల్వే మార్గాలలో విద్యుత్ కార్మాగారాలు పరిశ్రమలలో భూములు కోల్పోయిన వారికి మార్కెట్ విలువ ప్రకారం ఉపాధి పునరావాసం కల్పించాలన్నారు ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల నుండి 50 రోజులకు కుదించకుండా 150 రోజులకు పెంచాలని పట్టణ పేదలకు కూడా వర్తింపజేయాలని దానికి అనుగుణంగా బడ్జెట్ పెంచాలని నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రణలో ఉండేటట్లు చూడాలన్నారు పెట్రోల్ డీజిల్ లీటర్ 50 నుండి 40 రూపాయలుగా వంట గ్యాస్ ధరను సిలిండర్ పై 500 రూపాయల సామాన్యులకు అందుబాటులోకి తేవాలన్నారు పైన పేర్కొన్న అన్ని రంగాలలో సబ్సిడీలను యధాతధంగా కొనసాగించి పేదలకు అందించాలన్నారు కిరాణా వస్త్ర రిటైల్ రంగాలను నాయి బ్రాహ్మణ డోలి చేనేత వృత్తులను కార్పోరేట్ దోపిడీ నుంచి కాపాడాలన్నారు రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర కల్పించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించి కౌలు రైతులను గుర్తించి వారికి భద్రత భరోసా కల్పించాలన్నారు అనుభవదారు కాలంలో భూమిని కొనుగోలు చేసుకున్న వారి పేర్లు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు రైతు రుణమాఫీ పథకం ప్రయోజనకరమైందే అదే సమయంలో లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయాలన్నారు రైతులకు వడ్డీ లేని రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోడి భూములు గుర్తించిన 11.5 లక్షల ఎకరాలకు 75 సంవత్సరాలుగా ఏజెన్సీలో నివసిస్తున్న గిరిజనేతరులకు పోడుపట్టాలి ఇవ్వాలని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గిరిజన గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామపంచాయతీలో మార్చాలని డిమాండ్ చేశారు అర్హత కలిగిన దళితులందరికీ దళిత బంధు పథకాన్ని పాదదర్శంగా కలెక్టర్ల ద్వారా అమలు చేయాలని మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించాలని పై వర్గాల విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్లతో కూత విధించకుండా కొనసాగించాలని కేంద్రం మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్పులు పునరుద్ధరించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి 3000 చెల్లించాలని అన్నారు డీఎస్సీలో క్వాలిఫై అయిన విద్యార్థులకు ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ పార్ట్ టైమ్స్ మినిమం టైం స్కేల్ గెస్ట్ లెక్చరర్స్ పర్మనెంట్‌గా మిగిలిన కాంట్రాక్టు లెక్చరర్ క్రమబద్ధీకరించాలని సింగరేణి ఆర్టీసీ జెన్కో ఆర్డినెన్స్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీ పాఠశాల కళాశాల ప్రభుత్వ పరిశ్రమలు కార్యాలయాల్లోని అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ కార్మికులు ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తూ పర్మినెంట్ ప్రక్రియలు అమలు చేయాలన్నారు స్కీం వర్కర్స్ అంగన్వాడీ ఆశ హెల్త్ ఆరోగ్య రంగంలోని ఏఎన్ఎం జిఎన్ఎమ్ వివోఏలను క్రమ పద్ధతిలో పర్మినెంట్ చేస్తూ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మిడ్ డే మీల్స్ కార్మికులను ప్రకటించిన విధంగా 3000 చెల్లించాలన్నారు హమాలీ భవన నిర్మాణ కార్మికులు ఆటో టాక్స్ డ్రైవర్లు ఇతర మోటార్ కార్మికులు పనులు కూరగాయల షాపులో గుమాస్తాలు చిన్న వర్తకులు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో కట్టి 58 సంవత్సరాలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు ప్రమాదంలో మరణించిన భవన నిర్మాణ కార్మికులకు 20 లక్షల గాయపడిన వారికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు వృద్ధాప్య వికలాంగుల వితంతు ఒంటరి మహిళలకు పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని అసంఘటితరంగా కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతరాలు పిఎఫ్ పెన్షన్ బీమా లాంటి సౌకర్యాలు కల్పించాలన్నారు అర్హత కలిగిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు తక్షణమే మంజూరు చేయాలని రేషన్ షాపులో కేంద్ర ప్రభుత్వం విధానం వలన వివిధ ఆహార పదార్థాలను పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు కేంద్రంపై పోరాటం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వం బియ్యంతో పాటు గతంలో లాగా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలన్నారు డ్వాక్రా గ్రూపులకు 10 లక్షల వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేసి రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చి గృహలక్ష్మి పథకం కింద కేంద్ర నిధులను జోడించి ఒక్కో ఇంటికి 10 లక్షలు కేటాయించాలని జీవో 58 ప్రకారం 20 20 గడువుతో సంబంధం లేకుండా పేదలకు పట్టాలు జీవో 59 ప్రకారం 500 గజాల లోపు వారికి నామమాత్రపు ధరలతో పట్టాలు ఇవ్వాలని కోరారు ఆర్టీసీ సింగరేణి ఉద్యోగుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని అలాగే ఆర్టీసీ సింగరేణిలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు తక్షణం జరపాలి జెపిఎస్ వివోఏల సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలిపారు
భారత కమ్యూనిస్టు పార్టీ కరపత్రం ఆవిష్కరించిన సిపిఐ నాయకులు




