కృష్ణ జిల్లాలో 10మంది పోలీసుల సస్పెండ్
కృష్ణ: కంచికర్ల మండలంలోని పరిటాల ఉమ హాలీడే పేకాట క్లబ్‌పై జూన్ నెలలో దాడి చేసి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నందిగామ కోర్టుకు హాజరు పరిచే సమయంలో మెజిస్ట్రేట్ ఇంటి సమీపంలో పేకాట రాయుళ్లు పోలీసుల కళ్లు గప్పి పారీపోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎస్పీ బాధ్యతారహితంగా విధులు నిర్వర్తించిన నందిగామ సబ్ డివిజన్‌కి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్‌తోపాటు 9మంది కానిస్టేబుల్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.