హుజూర్ నగర్ ఫిబ్రవరి 12 (జనంసాక్షి): మహిళల పీరియడ్స్ కెమికల్స్ లేని సానిటరీ న్యాప్కిన్స్ ప్రభుత్వాలు ఉచితంగా అందించే విధంగా చట్టం చేయాలని విన్నపం ఒక పోరాటం రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్లో నందు ఆమె మాట్లాడుతూ స్త్రీలకు పీరియడ్స్ అవసరమైన శానిటరీ నాప్కిన్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందించాలి. పీరియడ్స్ సమయంలో స్కూలు విద్యార్థులు, కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తుల మహిళలకు రెండు రోజులు సెలవు ప్రకటించాలి. వీటిపై పార్లమెంటులో చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పబ్బతి స్రవంతి , వివిధ ఎన్జీవోలు ఆర్యవైశ్య మహిళ సంఘం సభ్యురాలు తమ్మన సుజాత, రిటైర్డ్ యూనియన్ ఆనర్ ప్రెసిడెంట్ అంకతి అప్పయ్య, డిఎస్ఆర్ ట్రస్టు చైర్మన్ దగ్గుపాటి బాబురావు, జన చైతన్య ట్రస్టు చైర్మన్ పారసాయి నాయుడు, జనరల్ సెక్రటరీ పిల్లి శివ సప్తస్వర, శ్రీ రామాంజనేయ ఆసరా నాట కళామండలి చైర్మన్ చిమట సైదులు, పాశం నరసింహారావు ఎవైఐఎఫ్ మండల కార్యదర్శి కే నాగేశ్వరరావు, సప్తస్వర నాట్య కళామండలి మండలి అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, లలిత కళ నాట్య కళ మండలి అధ్యక్షులు గొట్టముక ఆరోగ్యమే మహాభాగ్యం ట్రస్ట్చైర్మన్ వెంకీ, స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ విజయ, గిరిజనశక్తి ప్రధాన కార్యదర్శి మధు నాయక్, అపరంజి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన్నూరు కాశయ్య, మధు నాయక్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.




