కెవికె, మామునూరు, వరంగల్ వారి ఆధ్వర్యంలో గ్రామంలో రైతు వేదిక మొగిలిచర్ల గ్రామంలో ప్రపంచ మృతిక దినోత్సవం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నాగభూషణం ప్రధాన శాస్త్రవేత్త వరి విభాగం మాట్లాడుతూ మట్టి నమూనా సేకరణ మరియు దాని పరీక్ష విధానం గురించి వివరించారు. అంతేకాకుండా పంట మార్పిడి యొక్క ప్రాముఖ్యతను పచ్చి రొట్టె పైరుల గురించి తెలియజేశారు. డాక్టర్ సిహెచ్ సౌమ్య సేద్య విభాగపు శాస్త్రవేత్త గారు మాట్లాడుతూ రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని, భూమిని తక్కువ దున్నాలని, వివిధ పంటలను పండించి నేల కొరతను అధిగమించాలని తెలియజేశారు. తరువాత జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ప్రపంచ మృత్తిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేలను పరిరక్షించుకునే భాగంగా మొక్కలను నాటాలని చెప్పారు. ఆ తరువాత విద్యార్థిని విద్యార్థులందరితో మమేకమై ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాస్త్రవేత్తలు డాక్టర్ శశాంక్ మరియు డాక్టర్ సాయి కిరణ్, వ్యవసాయ విస్తరణ అధికారి అబిద్ హుస్సేన్, కార్పొరేటర్ ఏ మనోహర్, పీఏసీఎస్ చైర్మన్ డి రమేష్ రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జి రాజు, జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు, పిఈటి టీచర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
కెవికె, మామునూరు, వరంగల్ వారి ఆధ్వర్యంలో




