రైతులుఎరువులు,క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వినియోగించవద్దు
చెఱకు,వరి పరిశోధన సంస్థ సైంటిస్ట్ బాలాజీ నాయక్.
ఉమ్మడి కోటగిరి మండలంలో ఘనంగా ప్రపంచ నేల దినోత్సవ వేడుకలు.
కోటగిరి డిసెంబర్ 5 జనం సాక్షి:-అధిక పంట దిగుబడి కోసం రైతులు విచ్చలవిడిగా ఎరువులు,క్రిమిసంహారక మందులను వాడి నేలను విషతుల్యం చేస్తున్నారని చెరుకు,వరి పరిశోధన సంస్థ సైంటిస్ట్ బాలాజీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం రోజున ఉమ్మడి కోటగిరి మండలంలోని కోటగిరి,ఎత్తోండ,కల్లూరు పోతంగల్,హెగ్డోలి క్లస్టర్ల పరిధిలోని రైతు వేదిక నందు మండల వ్యవసాయ శాఖ, ప్రాంతీయ చెరుకు వరి పరిశోధన సంస్థ వ్యవసాయ పాలిటెక్నిక్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐదు క్లస్టర్ల అధికారులు,రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా హెగ్డోలి క్లస్టర్లో ప్రాంతీయ చెఱకు,వరి పరిశోధన సంస్థ సైంటిస్ట్ బాలయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలను సాగు చేయాలన్నారు. ఎరువులు,క్రిమిసంహారక మందులను రైతులు విరివిగా వాడటం వల్ల నేలలో పోషకాలు లోపించి తద్వారా మనిషికి తగిన వన్ని పోషకాలు అందక అనేక రకాల వ్యాధులకు నేడు గురవుతున్నారని పేర్కొన్నారు. ఒక స్పూన్ మట్టిలో భారత దేశ జనాభా అంత సూక్ష్మజీవులు ఉంటాయన్నారు.ఒక రాయి నుండి మట్టి తయారు కావడానికి 1000 సం.ల సమయం పడితే,అదే మట్టిని నేడు రైతులు దున్నడం చేత అందులో ఉన్న కర్మణ పదార్థాలు గాలిలో ఆవిరిపై 2 సం.లలోనే నేల కోతకు గురై మట్టి మొత్తం సముద్రంలో కలిసిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు వాడే ఫర్టిలైజర్లో 30 శాతం మాత్రమే మొక్కలు ఉపయోగించుకొని మిగతా 70 శాతం భూమి,గాలి,నీరు కలుషితానికి గురై తద్వారా జీవవైవిద్య సమతుల్యతకు ఆటకం కలుగుతుందని అన్నారు. అందుకనే 2015 నుండి ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న నేల దినోత్సవ వేడుకలను నిర్వహించి రైతులకు నేల యొక్క విశిష్టత గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.కావున రైతులు నేల యొక్క ప్రాముఖ్యతను గ్రహించి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయనికి మళ్ళీ, ఆరోగ్యకరమైన పంటలను పండించి నేలలో ఉండే పోషకాల సమతుల్యతను కాపాడాలని రైతులకు కోరారు.ఈ కార్యక్రమంలో సైంటిస్ట్ ప్రవీణ్,ఏవో శ్రీనివాసరావు,ఆర్గానిక్ ఫార్మర్స్ పుష్ప,పాపారావు,మండల ప్రజా ప్రతినిధులు,రైతు సమన్వయ సమితి ప్రతినిధులు,ఏఈఓ లు,రైతులు,అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు




