నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. బాబు జగ్జీవన్ రావ్ 116 వ జయంతిని కెవిపిఎస్ అధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి. నాగేశ్వరావు మాట్లాడుతూ అట్టడుగు కుటుంబంలో దళిత కుటుంబంలో పుట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ,అనేక సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొని దళితో ద్దారణకు, సామాజిక అణిచివేత దోపిడి దౌర్జన్యాలు ఎదుర్కొని సాంఘిక దురాచార నిర్మూలనకై జీవితాంతం పోరాటం చేశారన్నారు.ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారని రాజ్యాంగ ఫలాలు పేదలకు అందజేయడానికి కృషి చేశారని ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ధూళిపాల ధనుంజయ నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు, అసంఘటితరంగా కార్మికుల సమస్యలపై చట్టసభలలో వారి హక్కులకై పోరాటం చేశారన్నారు.ఆయన స్ఫూర్తితో మనువాదం పై ఉద్యమాలు నిర్మించాలని ప్రజలంతా చైతన్యంతో ముందుకు రావాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్ మాట్లాడుతూ దళిత గిరిజన మైనారిటీలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు కులవివక్షతపై ప్రజలు ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు చైతన్యంతో పోరాటంలో పోరాటాల్లో పాల్గొనాలని అన్నారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి దొరేపల్లి.వెంకటేశ్వర్లు కెవిపిఎస్ టౌన్ అధ్యక్షులు గుర్రం ఏసు,కార్యదర్శి కొమ్ము బిక్షం, సిఐటియు నాయకులు నీలా.రామ్మూర్తి, బాలెన వెంకటేశ్వర్లు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎడవెల్లి చంద్రయ్య బీఎస్పీ నియోజకవర్గ కన్వీనర్ సుబ్బు గౌడ్ ఎడ్ల సైదులు, ఒగ్గు సైదులు, కోదాటి సైదులు తదితరులు పాల్గొన్నారు.





