సీ ఎం కే సీ ఆర్ గారు ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలకి రక్షణ కల్పించాలి.
* తక్షణమే ఎమ్మేల్యే చిన్నయ్య ను పార్టీ నుండి సస్పెండ్ చేసి,కేసు నమోదు బాధితులకు న్యాయం చేయాలి.అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజా సొమ్ము ను దుర్వినియోగం చేస్తూ ఎమ్మేల్యే కి హైదర్ గూడ లో ఇచ్చిన 404 ఫ్లాట్ ను బ్రోతల్ హౌస్ గా మార్చిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలి.* ఇప్పటి కైన తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు వాస్తవాలను 5 కోట్ల మంది ప్రజలు కి తెలియజేయాలి. ఆరిజిన్ డైరీ విషయం లో నే కాకుండా ఎమ్మేల్యే మరియు ఎమ్మేల్యే అనుచరులు భీమా గౌడ్,గోలి శివ లు చేసిన భూ కబ్జాల మీద విచారణ చేసి నిజాలను ప్రజలకి తెలియజేయాలి.* అన్యాయంగా నా మీద పెట్టిన తప్పుడు కేసులు మీద పూర్తి విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. ఎమ్మేల్యే చిన్నయ్య నన్ను లైంగికంగా,మానసికంగా వేదించడమే గాక నన్ను చంపేందుకు తన అనుచరులను పంపి బెదిరించిన కారణంగా వారి మీద కూడా కేసు నమోదు చేయాలి.అందుకు నిరసనగా ఈరోజు సీ ఎం గారు మంచిర్యాల విచ్చేస్తున్న సందర్భంగా నేడు మధ్యాహ్నం 1 గంటకి ఢిల్లీ లో ఉన్న జాతీయ బీ అర్ ఎస్ కార్యాలయం ముందు ఫ్లెక్సీ తో నిరసన తెలియజేయడం జరిగింది.
కెసిఆర్ గారు న్యాయం చేయండి!




