Thursday, 5 November 2026

కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి -ఎం ఎల్ ఏ సండ్ర

పెనుబల్లి, జూన్9(జనం సాక్షి)తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందని ఇల్లే లేదని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు,తెలంగాణ ఆవిర్భావ ద‌శాబ్ది ఉత్స‌వాల్లో భాగంగా శుక్రవారం పెనుబల్లిలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో సంక్షేమ ఫలాల లబ్ధిదారులతో సంక్షేమ దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో ఘనంగ నిర్వహించారు, ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె సి ఆర్ ప్రజలకు మంచి పనులు చేయడం లో తెలంగాణా రాష్ట్రాన్ని దేశానికి ఉదాహరణగా నిలిచేలా చేశారని అన్నారు,తెలంగాణా రాష్ట్రంలో అమలౌతున్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రాలలో లేవని అన్నారు, కార్యక్రమంలో సండ్ర రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు, బీసీ కుల వృత్తుల సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించడం కొరకు ప్రవేశపెట్టిన బీసీలకు లక్ష ఆర్థిక సహాయం పథకంలో భాగంగా లబ్ధిదారులకు చెక్కులను సండ్ర అందజేశారు. పెడింటి ఆడబిడ్డల పెళ్ళి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను, చెక్కులతో పాటు ఎమ్మెల్యే పెళ్లికూతురులకు సొంత ఖర్చులతో చీరను బహుకరించారు,ప్రభుత్వ స్థలాల్లో కొన్నాళ్ల క్రితం ఇండ్లను నిర్మించుకున్న నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు, అనంతరం సంక్షేమ ఫలాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే సండ్ర సహపంక్తి భోజనం చేశారు.కార్యక్రమంలో ప్రజా ప్రతినిధి నిదులు,వివిధ శాఖల అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.