కెసిఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 07,
జనంసాక్షి:
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రోజున జగిత్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో నిన్నటి రోజున జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి సత్యం రెడ్డి,యూత్ కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్,కిసాన్ కాంగ్రెస్ మల్లాపూర్ మండల్ ప్రెసిడెంట్ వెంచిర్యాల చిన్నారెడ్డి,చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణరెడ్డి,గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ లను,మరియు అలాగే ఈరోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బెజ్జారపు శ్రీనివాస్, టిపిసిసి కన్వీనర్ మైనార్టీ డిపార్ట్మెంట్ అబ్దుల్ హఫీజ్ లను ముందస్తు అరెస్టులు చేసి ఫోన్ లు లాక్కొని భయట ప్రపంచంతో సంభందం లేకుండా చేసి నిర్భందించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి పర్యటించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు భయపడి రెండ్రోజుల ముందు ముందస్తు అరెస్టులు చేయడం బయట ప్రపంచంతో సంబంధం లేకుండా చేయడం దారుణం. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తామని, రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని గతంలో చెప్పిన కేసిఆర్ ఎందుకు మాటతప్పాడు.రైతులతో పెట్టుకున్న ఏ పార్టీగానీ నాయకుడు గానీ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు.అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు.ఖబర్దార్ కే సీ ఆర్. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు
కెసిఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్




