మంత్రి సత్యవతీ రాథోడ్ కు వినతి పత్రం అందజే సిన
అంగన్ వాడి టీచర్స్
పెనుబల్లి, డిసెంబర్ 7(జనం సాక్షి)
అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ సౌకర్యం కల్పించాలి అని కోరుతూబుదవారం మహిళా అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖా మాత్యులు సత్యవతి రాథోడ్ ను మహబూబాబాద్ లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భం గా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ సౌకర్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆశీస్సులతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గౌరవప్రదమైన పిలుపు, ఉద్యోగులతోపాటు వేతనంలో 30% పిఆర్సి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐ సి డి ఎస్ లో కేంద్ర ప్రభుత్వ స్కీమ్ వర్కర్స్ పేరుతో పనిచేసినా ఉద్యోగులతో సమానంగా జాబ్ చార్ట్ ప్రకారం పూర్వ ప్రాథమిక విద్య టీచర్స్ గా పనిచేస్తూ ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీ,బాలింత స్త్రీలు 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు సేవలందిస్తున్నామని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పని చేస్తున్నామని తెలిపారు. ఇ సి డి ఎస్ లో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వయోభారం, అనారోగ్యాలతో ఇటీవలి కాలంలో చాలామంది మరణించారని ,ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. కృష్ణకుమారి, రాష్ట్ర నాయకులు వి.రమాతార, లీలావతి, శ్యామల, గొర్రె రాధ, బత్తిని శిరీష, జె. మంగమ్మ, రమణ,ఉమ, నసీమా,సునీత, సత్య వేద,జ్యోత్స్న,అనిత, రజిత, కోమల, సంపూర్ణ,స్వప్న, జ్యోతి, జయలక్ష్మి,స్వరూప రాణి, వాణి, నాయకులు పాల్గొన్నారు.




