బెల్లంపల్లి, మే 16, (జనంసాక్షి )ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల పక్షపాతి అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని 20, 21 వార్డులలో ఇంటింటికి తిరిగి పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొని ఉన్నప్పటికీ వాటిపై ఎలాంటి హక్కులు లేవని, తాజాగా ముఖ్యమంత్రి కెసిఆర్ అలాంటి పేదలకు హక్కులు కల్పించడానికి పునుకొని పట్టాల పంపిణి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ, సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్నా, ఇంత వరకు దరఖాస్తు చేసుకోకుంటే ఈనెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు గోసిక రమేష్, కమల, అశోక్, గెల్లి రాయలింగు, కో అప్షన్ సభ్యుడు ఏలూరి వెంకటేష్, నాయకులు నూనేటి సత్యనారాయణ, విజయ్, దామెర కిరణ్, అన్వర్, శ్రీధర్, నెల్లి రమేష్, తడక రవి, గోలి శివ, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




