మిర్యాలగూడ జనం సాక్షి. స్థానిక విజేత డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెడ్ల ధనుంజయ తెలిపారు. మంగళవారం స్థానికంగా మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన ఎం ఎస్ ఎన్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈనెల 18వ తేదీ గురువారం నాడు కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నమన్నారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థుల కోసం 20 సంవత్సరాలలోపు వారికి మాత్రమే అవకాశం ఉందన్నారు. ఎమ్మెస్ ఎన్ లాబరేటరీస్ లో టెక్నికల్ ట్రైనీస్, ఇతర ఉద్యోగాలలో కూడా ఖాళీలు ఉన్నాయని అర్హతలుగా పదవ తరగతిలో మార్కులతో ఉత్తీర్ణత, ఇంటర్మీడియట్లో 55% మార్కులతో 2022,23 సంవత్సరాల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి, వయోపరిమితిగా 20 సంవత్సరాల లోపు అర్హులుగా పేర్కొన్నారు. జాబ్ మేళా లో పాల్గొనదలిచినవారు పాస్వర్డ్ ఫోటో ఆధార్ కార్డు విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ ను తీసుకొని గురువారం ఉదయం 9 గంటల వరకు హాజరుకావాలని సూచించారు. ఇందులో కనీస వేతనాలుగారూ 11 వేల రూపాయలు, మొదటి రెండు సంవత్సరాలు ఉచిత వసతి, ఉచిత వాహన సౌకర్యంతో పాటు డిగ్రీలో బీఎస్సీ గ్రూపులో చదివేవారికి సంస్థ రాయితీలు కల్పిస్తుందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.




