బెల్లంపల్లి, మే 16, (జనంసాక్షి )బెల్లంపల్లి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని ముల్కల సాయి వర్షిత 2022-2023 విద్యా సంవత్సరంలో 10/10 జిపిఏ సాధించిన సందర్బంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూల బొకే అందించి, శాలువాతో సత్కారించి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు అధిరోహించాలని, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, డైరెక్టర్లు ఏలూరి వెంకటేష్, రవి ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజా రమేష్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




