: రైతులకు పంట రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, జిల్లా రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పోజు సూర్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాల ధనుంజయ నాయుడు, పోకల వెంకటేశ్వర్లు, దేవరం మల్లేశ్వరి లు అన్నారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది రైతన్నలతో ధర్నా నిర్వహించడం జరిగింది. వివిధ డిమాండ్ లతో కూడిన వినతి పత్రమును సూపర్డెంట్ ప్రభాకర్ కి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరణిలో ఉన్నటువంటి అనేక లోపాలను, 47 తప్పులను సవరించి రైతుల ఇబ్బందుల నుండి ఆదుకోవాలని కోరారు. పోడు భూము రైతులకు నేటికీ భూమిపై ఉన్నటువంటి 30,40 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి వాస్తవ పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు అరికట్టాలని, కల్తీ విత్తనాలు అమ్మే వారిపై పిడి యాక్ట్ నమోదు ఛడ అరికట్టాలని. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సబ్సిడీపై విత్తనాలు ఎరువులు రైతులకు అందించాలని, ట్రాక్టర్ ఉన్న రైతులకు సబ్సిడీపై ఫుల్ వీల్స్, ఆఫ్ వీల్స్, కల్టివేటర్, పట్లర్ అందించాలని కోరారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని వారన్నారు. తక్షణమే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి భూసార పరీక్షలు చేసి కార్డులు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, ఎల్లావుల రమేష్, మామిడి నరసయ్య, జడ శ్రీనివాస్, దొంతగాని సత్యనారాయణ, చిలక రాజ్ శ్రీనివాస్, అమరారపు పున్నయ్య, జడ వెంకన్న, పశ్యా వెంకటరెడ్డి, సోమగాని కృష్ణ, ఎల్లావుల ఉమా, సుందరి పద్మ, కందుల వెంకటేశ్వర్లు, అంబటి బిక్షం నాయుడు, మామిడి నరసయ్య, పొనుగుపాటి వాసుదేవరావు, చిన్నగాని సైదులు, కత్తి శ్రీనివాస్ రెడ్డి, కడియాల అప్పయ్య, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు పంట రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి – తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా




