Wednesday, 4 November 2026

కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే దేశంలో ఏ రాష్ట్రంలో లేన విధంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూన్ 14 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే దేశంలో ఏ రాష్ట్రంలో లేన విధంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు . తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక శిల్పారామంలో వైద్య ఆరోగ్య దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు . ముందుగా మంత్రి
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే వైద్యరంగంలో ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని అన్నారు . ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు వైద్య రంగాన్ని గాలికి వదిలేసారని ఆయన విమర్శించారు . పేద ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంలో అనేక మార్పులు తెచ్చారని ఆయన గుర్తు చేశారు . అభివృద్ధి చేసే పాలకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టలని
కోరారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి పేర్కొన్నారు
మహబూబ్ నగర్ వైద్య ఆరోగ్య రంగంలో సాధించిన ప్రగతిని ప్రదర్శించిన డాక్యుమెంటరీలను మంత్రి సహా మిగతా అతిథులు తిలకించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ జి రవి నాయక్, గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, ముడా ఛైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, ఎంపీపీ సుధాశ్రీ, జిల్లా వైద్యాధికారి డా. కృష్ణ, మెడికల్ కళాశాల డైరెక్టర్ డా. రమేష్, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రామ్ కిషన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా జీవన్, వెటర్నరీ జాయింట్ డెరైక్టర్ మధుసూదన్ గౌడ్, డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ డా. భాస్కర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ స్వరాజ్యలక్ష్మి, వైద్యాధికారులు డా. శశికాంత్, డా. రఫిక్, డా. ప్రగతి, డా మోతీలాల్, డా. స్వప్న, డా. రాధ, జీజీహెచ్ సభ్యులు సత్యం యాదవ్, లక్ష్మి, మల్లేష్, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.