మహబూబ్నగర్జిల్లాప్రతినిధిజూన్14(జనంసాక్షిగురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పల్లె ప్రగతి దినోత్సవం లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అధికారులను ఆదేశించారు బుధవారం పల్లెపగతి దినోత్సవం నిర్వహణపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . కార్యక్రమంలో అధికారులు గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు ,ప్రజలు, గ్రామస్థాయి సిబ్బంది అందరూ భాగస్వాములు కావాలని ఆయన చెప్పారు .పల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేయాలని, తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ఉత్సవాలు నిర్వహించాలని, పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలలో కల్పించిన మౌలిక సదుపాయాలన్నింటిని శుభ్రం చేయడమే కాకుండా, గ్రామస్తులు ఆయా మౌలిక సదుపాయాలను సందర్శించే విధంగా చూడాలని కోరారు. గతంలో ఎలాంటి సౌకర్యాలు గ్రామాలలో ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలియజేయాలన్నారు సర్పంచు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారని, అందరూ క్షేత్రస్థాయి సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరుకావాలని, జాతీయగీతం ఆలపించాలని ఆయన సూచించారు .గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ ఇచ్చామని, వాటి అన్నింటిని అందరూ తెలుసుకునే విధంగా ప్రదర్శించాలన్నారు. పల్లె ప్రగతి దినోత్సవ సంబరాలలో ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యేలా చూడాలని ,పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి వచ్చిన నిధులు, పొందిన లబ్ది, మౌలిక వసతుల వివరాలను తెలియజేయాలని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు. గతంలో గ్రామంలో పరిశుభ్రత పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు
పల్లె ప్రగతి దినోత్సవం లో భాగంగా గ్రామాల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిభింబించేలా , పండుగ వాతావరణం లో జరగాలి




