Thursday, 5 November 2026

కెసిఆర్ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు

కెసిఆర్ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు

ధర్మపురి డిసెంబర్ 07(జనం సాక్షి న్యూస్ )జగిత్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ ప్రాణంగణంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేశారు సభా ప్రాంగణాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించడం ద్వారా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనము ప్రతి జిల్లాలో కలెక్టరేర్లు మరియు వైద్య కళాశాలలు నిర్మించుకున్నామని అన్నారు, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ,ఇవాళ ఒక అద్భుత‌మైన క‌లెక్ట‌రేట్ నిర్మాణం చేసుకున్నాం, జ‌గిత్యాల జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌కు ప్ర‌జ‌ల‌ కు హృద‌య‌పూర్వ‌కంగా అభినంద‌లు, శుభాకాంక్ష‌లు తెలుపుతూ,క‌ల‌ల‌లో కూడా అనుకోలేదు ఇది జిల్లా అయిత‌ది అని బాగా అభివృద్ధి చెందుతుంద‌ని, తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ది కాబ‌ట్టి జ‌గిత్యాల జిల్లా ఏర్పాటైంది.తెలంగాణ ఆధ్యాత్మిక ప‌రిమ‌ళాలు ఉన్న ప్రాంతం కాళేశ్వ‌రం, ధ‌ర్మ‌పురి, కొండ‌గ‌ట్టు అంజ‌న్న దేవాల‌యంతో పాటు ప‌లు పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయి. కొండ‌గ‌ట్టు అంజ‌న్న స‌న్నిధికి హ‌నుమాన్ భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. అంజ‌న్న దేవ‌స్థానం కేవ‌లం 20 ఎక‌రాల్లో మాత్ర‌మే ఉండేది. 384 ఎక‌రాల స్థాలాన్ని దేవాల‌యానికి ఇచ్చాం. 400 ఎక‌రాల భూమి కొండ‌గ‌ట్టు క్షేత్రంలో ఉంది. కొండ‌గ‌ట్టు అంజ‌న్న క్షేత్రానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నాం అని త్వ‌ర‌లోనే నేను స్వ‌యంగా వ‌చ్చి ఆగ‌మ‌శాస్త్ర ప్ర‌కారం, భార‌త‌దేశంలో సుప్ర‌సిద్ధ‌మైన‌టువంటి పుణ్య‌క్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తాను అని హామీ ఇస్తున్నాను అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.