జనం సాక్షి :కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి వెన్నంటి నడిచిన ఎత్తం గ్రామ ప్రజానీకం ప్రజా నాయకుడు ఎత్తం గ్రామ ఎంపీటీసీ సాయిని శ్రీనివాస్ రావు గారికి బ్రహ్మరథం పట్టిన గ్రామస్థులు ఎమ్మెల్యే భిరం నియంతృత్వ కుట్రలను,అవినీతిని ప్రజల్లో ఎండగట్టిన మాజీ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఇళ్ల స్థలాల కేటాయింపుపై పేద ప్రజల తరఫున పోరాటం చేస్తే కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టిస్తే 26 రోజులుగా జిల్లా జైల్ లో ఉండి విడుదల అయిన కోడెర్ మండలం ఎత్తం గ్రామ ఎంపీటీసీ సాయిని శ్రీనివాస్ రావు గారికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎత్తం పురవీధుల గుండా ఎంపీటీసీ శ్రీనివాసరావు గారిని గ్రామ ప్రజలు తమ భుజాల మీద ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎంపిటిసి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో భిరం హర్షవర్ధన్ రెడ్డి కోసం భిక్షాటన చేసి మరి ఓట్లు వేయించి గెలిపించామని దానికి బహుమతిగా ఏ తప్పు చేయని నాపై అక్రమ కేస్ లు బనాయించి 26 రోజులు జైల్లో ఉంచారని నిలదీశారు.గత ఎన్నికల్లో గెలిపించిన ప్రజలచేతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేను ఓడించి తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు అనంతరం మాజీ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ సొంత వ్యాపారాలు సైతం వదులుకొని ఏత్తం గ్రామ ప్రజలకు ఎంతో ప్రజాసేవ చేస్తున్నారని గ్రామ ప్రజలకు వైద్య సౌకర్యం కోసం అంబులెన్స్ ఏర్పాటు చేశారని, సొంత ఖర్చులతో ఏత్తం గ్రామంలో ప్రజాసేవ చేస్తున్నారని ఇలాంటి ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని నిన్ను శాశ్వతంగా రాజకీయాలనుంచి సస్పెండ్ చేయాల్సి వస్తది కేవలం హెచ్చరించారు గెలిచిన మూడు నెలలకే ఎలా పార్టీలు మరాలో తెలిసిన ఎమ్మెల్యే కి, సింగోటం బ్రిడ్జి పేరుతో 5 లక్షల పెండింగ్ బిల్ కు 26 కోట్లు ఎలా రాబట్టాలో తెలిసిన ఎమ్మెల్యేకి కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మంత్రిగా ఉన్నప్పుడు 300 కోట్లకు పైగా మంజూరు చేయించిన వివిధ అభివృద్ధి పనులను ఎలా పూర్తి చేయాలో తెలియదా అంటూ ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో జూపల్లి గారితో పాటుగా కోడేరు మండల ఎంపీపీ కొండా రాధా సుధాకర్ రెడ్డి గారు, ఎత్తం గ్రామ సర్పంచ్ సాయిని వరలక్ష్మి గారు, కోడేరు మండల ఇతర ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు మరియు జూపల్లి గారి అనుచరులు ఉన్నారు
కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్




