రాయికోడ్ జనం సాక్షి జనవరి 12 రాయికోడ్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నవీత ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ అధికారులు తమకు సరైన సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా పనులు నిర్వహిస్తున్నందున సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సభ్యులు పేర్కొన్నారు. గత సమావేశాల్లో తీర్మానించిన అంశాలకు ఆమోదించిన ఆ అంశాల తాలూకు పనులకు నిధులు వచ్చిన మంజూరైన నిధులు టెండర్లకే పరిమితం చేస్తూ, సరియైన సమాచారం సభ్యులకు తెలియజేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ ను నిలదీశారు. సంవత్సర కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించిన స్పందించిన దాఖలాలు లేదన్నారు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విన్నవించిన స్పందించడం లేదు సమావేశాన్ని బహిష్కరించిన వారిలో కమిటీ వైస్ చైర్మన్ మారుతి, డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, హనుమంత్ రెడ్డి , గరీబుద్దిన్, వీరయ్య స్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నవీత ఆధ్వర్యంలో




