Thursday, 5 November 2026

ప్రజా సమస్యలపై,బీసీ హక్కుల కై ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులా

ప్రజా సమస్యలపై,బీసీ హక్కుల కై ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులా!?
బయ్యారం, జనవరి11(జనంసాక్షి):
ప్రజా సమస్యలపై ,బీసీ హక్కుల కోసం నిత్యం పోరాటం చేస్తున్న తెలంగాణ బీసీ సంక్షేమ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త వినయ్ బాబు ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం బయ్యారం మండల కమిటీ ప్రధానకార్యదర్శి గండు సురేష్ కుమార్ ,బయ్యారం మండల యువజన సంఘం అధ్యక్షుడు కాకి విజయ్ ,బయ్యారం మండల కోశాధికారి కీర్తి ఉదయ్ ,సహాయ కార్యదర్శి బండారి వినోద్ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపలేరని అన్నారు.