Thursday, 5 November 2026

కేంద్రబృందం పర్యటన

కడప,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్రం నుంచి వచ్చిన ఐఎఎస్‌ అధికారి మహేంద్రనాథ్‌ బృందం సోమవారం వేంపల్లి మండలంలోని గ్రామాలలో పర్యటించారు. వీరన్నగట్టుపల్లి, వేంపల్లిలోని రాజీవ్‌ నగర్‌, అలిరెడ్డిపల్లి, నందిపల్లి తదితర గ్రామాల్లో స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. ఆయా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆధార్‌ వలన వచ్చే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.