జుక్కల్ , జనవరి 24, (జనం సాక్షి),
కామారెడ్డి జిల్లా బిజేపి అధ్యక్షురాలు, జుక్కల్ మాజి ఎమ్మెల్ల్యే అరుణతారా మంగళవారం జుక్కల్ సమస్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళారు. నియోజక వర్గంలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని, నియోజక వర్గంలో గ్రామాలకు కనెక్టి విటి రోడ్ల నిర్మాణం చేపట్టాలని,జుక్కల్ మండలములోని కౌలాస్ కోటను పర్యాటక కేంద్రంగా అబివృద్ది చేయాలని, పిట్లం మండలం తిమ్మానగర్ బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని కోరారు.కేంద్రం నిధులతో జుక్కల్ నియోజక వర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆమె కేంద్ర మంత్రి కి విన్నవించారు.
కేంద్రమంత్రి దృష్టికి జుక్కల్ సమస్యలు




