డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం.
“జనం సాక్షి” క్యాలెండర్ ఆవిష్కరణ.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి.24.(జనంసాక్షి). జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని డిపిఆర్ఓ మామిండ్ల దశరథం అన్నారు. మంగళవారం జనం సాక్షి దినపత్రిక 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను మానవీయ కోణంలో ఆవిష్కరించడంలో జనంసాక్షి ముందుందని అన్నారు. మానవీయ కోణంలో కథనాలను అందించడం ద్వారా ప్రభుత్వ పరంగా బాధితులందరికో సహాయం అందేలా తోడ్పాటు అందించిందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో జర్నలిస్టులు పనిచేయాల్సి ఉందని అన్నారు. జనంసాక్షి జిల్లా ఇంచార్జ్ విజయ మాట్లాడుతూ ప్రజల సమస్యలను కథనాలుగా మలిచి అందించడంలో జనంసాక్షి పాత్రికేయులు ముందు వరుసలో ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో ఆల్లె రమేష్, చుంచు బాబు, లతీఫ్, ఇల్లెందుల మల్లేశం, గణేష్, ఆకుల గంగాధర్, నగేష్, పాల్గొన్నారు.




