అలవర్చుకోవాలి :శామీర్ పేట్, జనం సాక్షి :
శామీర్ పేట లో మండల నాయకులు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు.. సుభాష్ చంద్రబోస్ జయంతి ఒక్కటే ఉండి వర్ధంతి లేనటువంటి అమరుడు అని , శతృవులు గుండెలో సదా గుబులు పుట్టించే ఏకైక స్వాతంత్ర్య సమర యోధులు అని కొనియాడారు. ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో శామీర్ పేట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు విలాసాగరం సుదర్శన్, శామీర్ పేట మాజీ సర్పంచ్ బత్తుల కిషోర్ యాదవ్, కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి , బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్, ఐలయ్య యాదవ్ , బండి శ్రీరాములు, బత్తుల ప్రభాకర్, రవిందర్ , డాక్టర్ రమేష్, స్టార్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్రశేఖర్ గౌడ్, సంతోష్ గౌడ్, నాగరాజు గౌడ్, వెంకటేష్ గౌడ్, నసీర్, చిట్టి ,బత్తిని చందర్, పసుపుల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
24ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు
యువత సుభాష్ చంద్ర బోస్ ఆశయాలు




