కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ల రక్షణ, హక్కుల సాధన కోసం భారీ ర్యాలీ
* సిఐటియు ఆధ్వర్యంలోఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా
టేకులపల్లి,జనవరి 6 (జనం సాక్షి): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ స్కీముల రక్షణ, స్కీమ్ వర్కర్ల హక్కుల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలోశుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలోని స్థానిక బోడు రోడ్డు నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ బోయిన లావణ్యకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు నాయకులు అబ్దుల్ నబి, కడుదుల వీరన్న పాల్గొని మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్కీమ్ వర్కర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐ సీ డీ ఎస్, ఎమ్ డీ ఎం ఎస్, ఎన్ హెచ్ ఎం తదితర స్కీముల ప్రైవేటీకరణ ఆపాలి. బడ్జెట్ పెంచి బలోపేతం చేయాలి. ఎన్ ఈ పి _2020, డిజిటల్ హెల్త్ మిషన్ నీ ఉపసంహరించు కోవాలని, స్కీం వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలని, 45న ఐఎల్సి సిఫార్సుల ప్రకారం స్కీం వర్క్ అందరినీ కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అందరికీ నెలకు పదివేల రూపాయల పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ మొదలైన అన్ని సామాజిక భద్రత చర్యలు అమలు చేయాలి అన్నారు. అన్ని రాష్ట్రాల్లో వివిధ రకాల స్కీముల వర్కర్లకు ఒకే విధమైన సర్వీసు రూల్స్ ఉండాలి. నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి,స్కీం వర్కర్లను కార్మిక చట్టాల పరిధిలోకి తేవాలనే తదితర డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కి సమర్పించామని దేశవ్యాప్తంగా జరిగే ఈ నిరసన కార్యక్రమంలో 72 రకాల స్కీం వర్కర్లు పాల్గొన్నారు. దేశంలో కోటి మంది తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది స్కీం వర్కర్లు 40 సంవత్సరాలుగా ప్రభుత్వ పథకాలలో పనిచేస్తూ అనేక సమస్యలతో కొట్టుమ




